భారతీయ రైల్వే లో ప్రభుత్వ ఉద్యోగం సాదించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB Technician Recruitment 2026) ఒక అద్బుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్ లో ఖాళీగా ఉన్న దాదాపు 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ తో పాటు దేశంలో ఉన్న అన్నీ ప్రధాన (RRB ) రీజియన్ లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు జీతం మరియు అప్లికేషన్ ప్రక్రియ వంటి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి

RRB Technician Recruitment 2026 📅IMPORTANT DATES:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 30- జూన్ 2026
దరకస్తూ చేయడానికి చివతి తేదీ 29- జులై 2026 రాతి 23:59 గంటల వరకు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 31 జులై 2026 వరకు
అప్లికేషన్ లో ఏవైనా తప్పులను సవరించడానికి 01- ఆగస్టు 2026 నుండి 10 ఆగస్టు 2026 వరకు ఉంటుంది
💼 పోస్టుల వివరాలు & జీతం (Post-wise Vacancies & Salary
- ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగానికి సంబందించి 323 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారికి పే లెవల్ 5 ప్రకారం 29,200 /- రూపాయల జీతం లబిస్తుంది
- అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి సంబందించి 6234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే పే లెవెల్ 2 ప్రకారం 19,900/- రూపాయల జీతం లబిస్తుంది
నోట్ ప్రారంభ వేతనం తో పాటు కేంద్ర ప్రభుత్వ నిబండాల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి
Educational Qualifications
- టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్: దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి పిజిక్స్ ఎలక్ట్రానిక్ కంప్యూటరు సైన్స్ ఐటి లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో డిగ్రీ కానీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
- టెక్నీషియన్ గ్రేడ్ 3: పదవతరగతి పాస్ అవడంతో పాటు ఐటిఐ గుర్తింపు పొందిన ట్రేడ్ లలో కచ్చితంగా పాస్ అయ్యి ఉంది అపపరెంటీసె కోర్సు చేసి ఉండాలి .






