కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పరిధిలోని DRDO CVRDE RECRUITMENT 2026: నెలకు రూ.37,000+ జీతంతో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాలు; ఈమెయిల్ చేస్తే చాలు! ‘కంబ్యాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్’ (CVRDE), ఆవడి (చెన్నై) నుండి సరికొత్త ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి గల భారతీయ పౌరుల నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, జీతం మరియు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
DRDO CVRDE RECRUITMENT 2026 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
సంస్థ పేరు: DRDO – CVRDE (ఆవడి, చెన్నై)
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)
మొత్తం ఖాళీలు: 16
అప్లికేషన్ విధానం: ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (Employment News) లో ఈ ప్రకటన వచ్చిన నాటి నుండి 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
VACANCIES DETAILS

అర్హతలు (Educational Qualifications):
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణి (First Division) మార్కులతో B.E / B.Tech తో పాటు వాలిడ్ GATE స్కోర్ కలిగి ఉండాలి.
లేదా ప్రథమ శ్రేణి మార్కులతో M.E / M.Tech (గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండింటిలోనూ ఫస్ట్ క్లాస్ ఉండాలి) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి (Age Limit):
దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు కింది విధంగా ఉండాలి:
- జనరల్ (Unreserved): 28 సంవత్సరాలు మించకూడదు.
- OBC (Non-Creamy Layer): 31 సంవత్సరాలు మించకూడదు.
- SC / ST: 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం మరియు ఇతర ప్రయోజనాలు (Stipend & Benefits):
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹37,000/- కన్సోలిడేటెడ్ స్టైఫండ్ లభిస్తుంది.
దీనితో పాటు రూల్స్ ప్రకారం HRA మరియు మెడికల్ సదుపాయాలు కూడా అందుతాయి.
ఈ ఫెలోషిప్ కాలపరిమితి మొదట రెండేళ్లు ఉంటుంది, ఆ తర్వాత నిబంధనల ప్రకారం పొడిగించే అవకాశం ఉంది.
ఎంపిక విధానం (Selection Process):
అభ్యర్థులు పంపిన అప్లికేషన్లు మరియు మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
షార్ట్‌లిస్ట్ అయిన వారికి చెన్నైలోని CVRDE ఆవడి కేంద్రంలో రాత పరీక్ష (Objective Type) మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి అదే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది.
పరీక్ష తేదీ, సమయం వివరాలను అభ్యర్థులకు నేరుగా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ (How to Apply):
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్‌ను (Annexure-I) ప్రింట్ తీసుకుని, పూర్తిగా పూరించాలి.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయు విధానం: పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ మరియు మీ విద్యార్హత సర్టిఫికెట్లు, గేట్ స్కోర్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం మొదలైన వాటిని సింగిల్ PDF ఫార్మాట్‌లోకి మార్చి pmhr.cvrde@gov.in ఈమెయిల్ ఐడీకి పంపాలి.
పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయు విధానం: ఒకవేళ పోస్ట్ ద్వారా పంపాలనుకుంటే, కింది చిరునామాకు పంపవచ్చు. కవరుపై తప్పనిసరిగా “Application for JRF Recruitment-2026” అని రాయాలి.
చిరునామా:
The Director,
Combat Vehicles Research & Development Establishment (CVRDE),
Min of Defence, DRDO,
Avadi, Chennai – 600054.
అధికారిక వెబ్‌సైట్: drdo.gov.in
OFFICIAL NOTIFICATION PLEASE CLICK HERE





