IBPS PO Recruitment 2026 విడుదల: 6715 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే! Apply Now

IBPS PO RECRUITMENT 2026

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు అలర్ట్! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS PO RECRUITMENT 2026) 2027-28 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) మరియు మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP) ద్వారా దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

IBPS PO RECRUITMENT 2026

IBPS PO RECRUITMENT 2026 ముఖ్యమైన తేదీలు (Important Dates)

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 01-07-2026
దరఖాస్తుకు చివరి తేదీ: 21-07-2026
ఫీజు చెల్లింపు గడువు: 01-07-2026 నుండి 21-07-2026
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్): ఆగస్టు, 2026
ప్రిలిమ్స్ ఫలితాలు: సెప్టెంబర్, 2026
మెయిన్ పరీక్ష (ఆన్‌లైన్): అక్టోబర్, 2026
ఇంటర్వ్యూలు: నవంబర్/డిసెంబర్, 2026
తాత్కాలిక కేటాయింపులు (Provisional Allotment): జనవరి, 2027

విద్యా అర్హత (Educational Qualification – As on 21.07.2026)

  • అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా యూనివర్సిటీ నుండి ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి అభ్యర్థి వద్ద చెల్లుబాటు అయ్యే మార్కు షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి.

వయోపరిమితి (Age Limit – As on 01.07.2026)

  • కనీస వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • అభ్యర్థులు 02.07.1996 కంటే ముందు మరియు 01.07.2006 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలిపి).

వయోసడలింపు (Upper Age Relaxation):

  • SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • PwBD (దివ్యాంగులకు): 10 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము (Application Fee)

  • SC / ST / PwBD అభ్యర్థులకు: రూ. 175/- (GSTతో కలిపి)
  • ఇతర అభ్యర్థులందరికీ: రూ. 850/- (GSTతో కలిపి)
  • గమనిక: బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అభ్యర్థులే భరించాలి. ఫీజును కేవలం ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం (Selection Process)

ఈ ఉద్యోగాల భర్తీ మూడు దశల్లో జరుగుతుంది:

  1. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అంశాలపై 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది.
  2. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: ఇందులో ఆబ్జెక్టివ్ (200 మార్కులు) మరియు డిస్క్రిప్టివ్ (25 మార్కులు) పేపర్లు ఉంటాయి.
  3. పర్సనాలిటీ టెస్ట్ & ఇంటర్వ్యూ: మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికలో మెయిన్స్ మార్కులు మరియు ఇంటర్వ్యూ మార్కులకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఇస్తారు.

నెగెటివ్ మార్కింగ్: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలలో తప్పు సమాధానానికి 1/4 వంతు (0.25) మార్కుల కోత ఉంటుంది.

IBPS PO RECRUITMENT 2026

దరఖాస్తు ప్రక్రియ (How to Apply)

  1. అభ్యర్థులు ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in సందర్శించాలి.
  2. హోమ్‌పేజీలో “CRP PO/MT” లింక్‌పై క్లిక్ చేసి, ఆపై “CLICK HERE TO APPLY ONLINE FOR CRP-PO/MT-XVI” ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  3. “CLICK HERE FOR NEW REGISTRATION” పై క్లిక్ చేసి మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
  4. రిజిస్ట్రేషన్ తర్వాత లభించే ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి అప్లికేషన్ పూర్తి చేయాలి.
  5. మీ ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, మరియు చేతితో రాసిన డిక్లరేషన్‌ను నిర్దేశిత సైజులో అప్‌లోడ్ చేయాలి.
  6. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ దగ్గర ఉంచుకోవాలి.
  • మరిన్ని వివరాలు మరియు అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ను చూడవలసిందిగా కోరడమైనది.

for official Website Please click Here

For Official Notification Please Click Here

Scroll to Top