తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ నిరుద్యోగులకు ఉపాది కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన నూతన పథకం Rajiv Yuva Vikasam ఈ యొక్క పథకం ద్వారా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనుకునే నిరుద్యోగులకు సబ్సిడీ ద్వారా బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక లక్ష రూపాయాల నుండి మూడు లక్షల రూపాయల వరకు రుణాలను అందించి ఆదుకోవాలని ఈ యొక్క పథకాన్ని 2025-2026 సంవత్సరానికి తీసుకువచ్చింది.
RAJIV YUVA VIKASAM SCHEME పూర్తి వివరాలు
RAJIV YUVA VIKASAM పథకం తెలంగాణ ప్రభుత్వం రాస్ట్రం లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ప్లాన్, క్రిస్టియన్ సబ్ప్లాన్, ద్వారా అందిస్తుంది ఈ యొక్క పథకానికి అర్హులు ఆన్లైన్ సెంటర్ గాని మీసేవ గాని అప్లై చేయవలసి ఉంటుంది . ఈ పథకం ద్వారా సబ్సిడీ ద్వారా రుణాలను అందించి అర్హులకు ఉపాది అవకాశాలను కల్పిస్తుంది అర్హత గల నీరుద్యోగుకు కావలసిన పత్రాలను సేకరించి ఆన్లైన్ లో అప్లై చేయండి .
RAJIV YUVA VIKASAM SCHEME పథకానికి కావలసినవి
RAJIV YUVA VIKASAM SCHEME ఎలా అప్లై చేయాలి
- తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన అఫిసియల్ వెబ్సైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి
- వెబ్సైట్ ఓపెన్ అయిన తరువాత రెండు బటన్స్ కనిపిస్తాయి అందులో ఉంది రాజీవ్ యువ వికాసం బటన్ పైన క్లిక్ చేయాలి
- ఆ తరువాత Rajiv Yuva Vikasam Scheme పైన క్లిక్ చేయాలి
- ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ ఎంబీసీ లాంటి బటన్స్ కనిపిస్తాయి అందులో నుండి మనం ఏ వర్గానికి అప్లై చేయాలో ఆ యొక్క బటన్ పైన క్లిక్ చేయాలి
- ఆ తరువాత దరకస్తూ దారునికి సంబందించిన దరకస్తూ ఆన్లైన్ ఫారం ఓపెన్ అవుతుంది
- అందులో దరకస్తూ దారుని పేరు ఆధార లో ఉన్న విధంగా, ఆధార నెంబర్, ఫోన్ నెంబర్ , రేషన్ కార్డ్ నెంబర్, తదితర వివరాలు నింపాల్సి ఉంటుంది ఆ తరువాత మనం ఏ సెక్టార్ లో లోన్ తీసుకుంటున్నామో ఆ యొక్క సెక్టార్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది
- ఆ తరువాత మనకి ప్రింట్ ఆప్షన్ వస్తుంది ఆ యొక్క దరకస్తూ ప్రింట్ తీసుకోవాలి
RAJIV YUVA VIKASAM పథకం లో ఎంత వరకు సబ్సిడీ వస్తుంది
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లోన్ తీసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. లబ్ది దారుడు తీసుకున్న లోన్ బట్టి ఎంత సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే లోన్ ఒక లక్ష రూపాయల లోపు తీసుకుంటే దాదాపు 80 శాతం వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉన్నది. అదే విధంగా రెండు లక్షల వరకు తీసుకుంటే 70 శాతం వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉన్నది . అదే విధంగా గరిష్టంగా లబ్దిదారుడు 3 లక్షల వరకు లోన్ తీసుకుంటే ప్రభుత్వం 60 శాతం వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నది. సబ్సిడీ పోవగా మిగిలిన డబ్బులను లబ్ది దారుడు బ్యాంక్ కి చెల్లించవలసి ఉంటుంది
RAJIV YUVA VIKASAM దరకస్తూ ఎక్కడ సమర్పించాలి
లబ్దిదారుడు తన దరకాస్తును ఆన్లైన్ లో నమోదు చేసిన తరువాత ఆ యొక్క దరకస్తూ తో పాటు, ఆధార కార్డ్, రేషన్ కార్డ్, కుల దృవీకరణ పత్రం, నివాస దృవీకరణ పత్రం, ఫోటో మరియు మొదలయిన జిరాక్స్ కాపీలను జత చేసి గ్రామ పంచాయతీ లబ్దిదారులైతే స్థానిక ఎంపీడీవో ఆఫీసు లో మున్సిపాలిటీ లబ్దిదారులైతే స్థానిక కమిషనర్ కి ఆ యొక్క దరకస్థులను సమర్పించవలసి ఉంటుంది